![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1107 లో... నేను తినను అని కోపంగా బయటకు వచ్చి కూర్చుంటుంది వసుధార. ఆ తర్వాత రంగా భోజనం తీసుకొని వసుధార దగ్గరికి వస్తాడు. వసు వెనకాల ఉన్న రంగాని వసుధార పిలుస్తుంది. మీరు వచ్చారని తెలుసు రండీ సర్ అని అంటుంది. మేడమ్ గారు భోజనం చెయ్యండి అని రంగా అంటాడు. నాకు అవసరం లేదని వసుధార అంటుంది. మీరు ప్రతిసారీ రిషి సర్ రిషి సర్ అంటుంటే మా నానమ్మకి ఏం అర్థం అవడం లేదు. మీరు అలా అనకండి అని రంగా అంటాడు. ఆ మాటలు అన్ని సరోజ వింటుంది.
ఆ తర్వాత రంగా రిక్వెస్ట్ చెయ్యడం తో వసుధార భోజనం చేస్తుంది. సర్ ఇప్పుడు తృప్తిగా ఉందని వసుధార అంటుంది. అప్పుడే రంగా ఫ్రెండ్ వస్తాడు. అన్న మేడమ్ గారి కోసం ఎవరో వెతుకుతున్నారని వసుధార ముందే చెప్తాడు. దాంతో మీరేం టెన్షన్ పడకండి మేడమ్ గారు.. మీరు ఇక్కడే ఉండండి మీకేం ప్రాబ్లమ్ రానివ్వనని రంగా చెప్తాడు. మీరు రిషి సర్ కాదంటున్నా మీ మాట మీ చూపు అంత కూడా నన్ను మోసం చెయ్యవ్ సర్ కానీ మీరు ఎందుకు ఇలా ఇక్కడుంటున్నారో తెలియడం లేదని అని వసుధార అనుకుంటుంది. మరొకవైపు దేవయాని, ఫణీంద్రలు మహేంద్ర దగ్గరికి వస్తారు. నీకు జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిది అని ఫణీంద్ర అంటాడు. నీపై బెంగపెట్టుకొని మీ అన్నయ్య సరిగ్గా తినడం లేదు.. పడుకోవడం లేదని దేవయాని అంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నీ గురించి టెన్షన్ గా ఉంది. నువ్వు మాతో పాటు అక్కడే ఉండమని ఫణీంద్ర అనగానే నేను రానని మహేంద్ర అంటాడు. అప్పుడు జరిగిన దానిని మనసులో పెట్టుకొని అంటున్నావ్ కదా.. అప్పుడు నీవు ఏమైపోతావోనన్న బాధలో అన్నాను దానికి సారీ కూడా చెప్పానని దేవయాని అంటుంది. నేను రాలేను అర్థం చేసుకోండని మహేంద్ర అంటాడు. సరే నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్ అని ఫణీంద్ర అంటాడు. మహేంద్రకి ఏదైనా ఇష్టమైన వంట చేసి తీసుకొని వస్తానని దేవయాని చెప్పగా.. ఫణీంద్ర సరేనని వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అనుపమ కిచెన్ లో ఉంటే దేవయాని వెళ్తుంది. అప్పుడే మహేంద్ర కూడా వెళ్తాడు. దేవయాని తన మాటలతో అనుపమని బాధపెడుతుంది. మరొకవైపు వసుధార దగ్గరికి రంగా వస్తాడు. తను నిద్రపోతు ఉంటుంది. రిషి సర్ అంటూ ఒక్కసారిగా లేచి చూస్తుంది వసుధార. దాంతో వసుధార చెయ్యిని రంగా పట్టుకొని.. నేను ఎలా ఉన్నా నన్ను గుర్తుపడతావని తెలుసు వసుధార .. నేను ఎందుకు ఎలా రంగా ఉంటున్నానో అర్థం చేసుకోమని వసుధారకి చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు తెలుసు మీరు నా రిషి సర్ అని వసుధార అంటుంది. మనది రిషీధారల బంధం వసుధార అని రిషి అంటాడు. డాడ్ ఎలా ఉన్నాడు.. నాకు చూడాలని ఉంది వెళ్దామా అని రిషి అనగానే.. పదండి సర్ అని వసుధార రిషి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |